రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా అనుమానితులు

      తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రవాప్తంగా 163మంది కరోనా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఈ రోజు ఏడుగురి రిపోర్టులు వచ్చే అవకాశముంది. ఈ వ్యాధి అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. వీవీఐపీలు ప్రత్యేక వార్డుల్లో ఉండేందుకు విముఖత చూపిస్తుండటంతో, వారికోసం గాంధీ ఆస్పత్రిలో పెయిడ్ రూంలు ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటివరకూ […]

Update: 2020-02-11 22:14 GMT

తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రవాప్తంగా 163మంది కరోనా వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా, రిపోర్టులు రావాల్సి ఉన్నది. ఈ రోజు ఏడుగురి రిపోర్టులు వచ్చే అవకాశముంది. ఈ వ్యాధి అనుమానితుల సంఖ్య పెరుగుతుండటంతో గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. వీవీఐపీలు ప్రత్యేక వార్డుల్లో ఉండేందుకు విముఖత చూపిస్తుండటంతో, వారికోసం గాంధీ ఆస్పత్రిలో పెయిడ్ రూంలు ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కానప్పటికీ, అనుమానితులు పెరుగుతుండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    

Similar News