158 మందితో న్యూడ్ కాల్స్.. ‘రెచ్చిపోయిన’ యువకులు
దిశ, వెబ్‌డెస్క్ : అందమైన అమ్మాయి కనబడితే చాలు.. అదోరకంగా చూస్తూ సొంగ కార్చుతారు కొందరు వ్యక్తులు. అయితే అలాంటి వారినే టార్గెట్ చేస్తూ కొందరు యువతులు వారిని కొల్లగొడుతున్నారు. ఫోన్ చాటింగ్, కాల్స్‌తో మైమరిపిస్తూ.. ట్రాప్ చేస్తున్నారు. ఇలా ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 150కి పైగా ఘటనలు జరిగాయంటే అతిశయోక్తి కాదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సాఫ్ట్వేర్ కంపెనీలతో ప్రముఖులకు నిలయంగా ఉంటుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలు రిచ్ […]
దిశ, వెబ్‌డెస్క్ : అందమైన అమ్మాయి కనబడితే చాలు.. అదోరకంగా చూస్తూ సొంగ కార్చుతారు కొందరు వ్యక్తులు. అయితే అలాంటి వారినే టార్గెట్ చేస్తూ కొందరు యువతులు వారిని కొల్లగొడుతున్నారు. ఫోన్ చాటింగ్, కాల్స్‌తో మైమరిపిస్తూ.. ట్రాప్ చేస్తున్నారు. ఇలా ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 150కి పైగా ఘటనలు జరిగాయంటే అతిశయోక్తి కాదు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సాఫ్ట్వేర్ కంపెనీలతో ప్రముఖులకు నిలయంగా ఉంటుంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలు రిచ్ కిడ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయి. సరిగ్గా ఈ ప్రాంతాలనే టార్గెట్ చేశాయి కొన్ని కన్నింగ్ ముఠాలు. అందమైన అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అందమైన యువతులు తమ ఫొటోలు పెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. వారి ఫొటోలను చూసి ఓకే చేశామా.. ఇక అంతే సంగతులు. మొదట హాయ్.. గుడ్ మార్నింగ్ అంటూ మొదలు పెట్టి ఆ తర్వాత ఫోన్ కాల్స్, వాట్సప్ కాల్ అంటూ హస్కీ వాయిస్‌లో యువకులను మత్తులోకి దింపుతారు. ప్రేమ, డేటింగ్ అంటూ రెచ్చగొట్టి నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాలని ఒత్తిడి చేస్తారు. వారి మాటల మత్తులో బట్టలు విప్పామా.. ఇక మన బతుకు బజారున పడ్డట్టే.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇలా నగ్నంగా వీడియో కాల్ మాట్లాడిన మగ మహారాజుల నుంచి రూ.2.10 కోట్లు కాజేశారు ఈ కన్నింగ్ కిలేడీలు. ఈ ఏడాది ఇప్పటి వరకు 158 మంది యువకులు నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అవతలి వాళ్లకు చిక్కారు. దీంతో తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని, మీ కాంటాక్ట్ నెంబర్లకు పంపిస్తామని బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి అందినకాడికి దోచుకున్నారు.
ఇదే మాదిరిగా గత ఏడాది 98 మంది నుంచి రూ.2.30 కోట్లను కొట్టేశారు కేటుగాళ్లు. ఇవన్నీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినవే. అయితే కేవలం న్యూడ్ కాల్ మాట్లాడిన యువకులే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారట, ఫోన్ ముందు నగ్నంగా ‘రెచ్చిపోయిన’ పురుష పుంగవులు మాత్రం తమ బాగోతం బయటపడుతుందని కేటుగాళ్లు అడిగినంత సమర్పించుకోని కిమ్మనకుండా ఉన్నారట.