ఆ డేట్ దాటితే అంతే.. ప్రభుత్వ వాహనాలకు ఇక నో రిజిస్ట్రేషన్..!

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2022 ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరించేది లేదని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసింది. అందుకు సంబంధించి నిబంధనల సవరణకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వాటాదారుల అభిప్రాయాన్ని కోరింది. వారి నుంచి ఆమోదం పొందిన […]

Update: 2021-03-13 09:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2022 ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరించేది లేదని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను శనివారం విడుదల చేసింది.

అందుకు సంబంధించి నిబంధనల సవరణకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ వాటాదారుల అభిప్రాయాన్ని కోరింది. వారి నుంచి ఆమోదం పొందిన అనంతరం దేశంలోని అన్ని ప్రభుత్వ వాహనాలకు సేమ్ రూల్స్ వర్తిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది.

Tags:    

Similar News