140 మిలియన్ల జననాలు @2021

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ.. ఎంతోమంది చిన్నారులు ఈ భూమ్మీద పురుడుపోసుకోగా, ఆ లెక్కలను యునిసెఫ్ తాజాగా వెల్లడించింది. కొవిడ్ భయాల కారణంగా కొన్ని లక్షల మంది అబార్షన్లు చేయించుకోగా, మరెన్నో కోట్ల మంది కొత్త ఆశలకు రెక్కలు తొడుగుతూ, తమ పిల్లలకు నూతన జీవితాన్ని అందించారు. ఈ క్రమంలోనే 2021, జనవరి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 3.7 కోట్ల మంది జన్మించినట్లు యునిసెఫ్‌ ప్రకటించగా, అందులో ఇండియానే టాప్ […]

Update: 2021-01-02 04:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ.. ఎంతోమంది చిన్నారులు ఈ భూమ్మీద పురుడుపోసుకోగా, ఆ లెక్కలను యునిసెఫ్ తాజాగా వెల్లడించింది. కొవిడ్ భయాల కారణంగా కొన్ని లక్షల మంది అబార్షన్లు చేయించుకోగా, మరెన్నో కోట్ల మంది కొత్త ఆశలకు రెక్కలు తొడుగుతూ, తమ పిల్లలకు నూతన జీవితాన్ని అందించారు. ఈ క్రమంలోనే 2021, జనవరి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 3.7 కోట్ల మంది జన్మించినట్లు యునిసెఫ్‌ ప్రకటించగా, అందులో ఇండియానే టాప్ ప్లేస్‌లో ఉండటం విశేషం.

యునిసెఫ్ ప్రతీ ఏడాది పుట్టిన పిల్లల లెక్కలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. అయితే నూతన ఏడాదిలోకి ప్రవేశించిన రోజున పుట్టినవారి లెక్కలతో పాటు వారి లైఫ్ టైమ్(ఆయు: ప్రమాణం)ను కూడా అంచనావేసి చెప్పింది. యునిసెఫ్ అంచనాల ప్రకారం జనవరి 1న పుట్టిన బిడ్డల సంఖ్యాపరంగా మొదటి పది దేశాలను చూస్తే.. ఇండియాలో 59,995 మంది శిశువులు, చైనాలో 35,615, నైజీరియాలో 21,439, పాకిస్తాన్‌లో 14,161, ఇండోనేషియాలో 12,336, ఇథియోపియాలో 12,006, అమెరికాలో 10,312, ఈజిప్టులో 9,455, బంగ్లాదేశ్‌లో 9,236, కాంగోలో 8,640 మంది శిశువులు జన్మించారట. ఇక 2021లో మొత్తంగా 140 మిలియన్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందని యునిసెఫ్‌ అంచనా వేసింది. వారి సగటు జీవిత కాలం 84 సంవత్సరాలు ఉండే అవకాశముండగా, ఇండియాలో మాత్రం 80 సంవత్సరాలే అని పేర్కొంది

‘కొత్త సంవత్సరం రోజు జన్మించిన పిల్లలందరూ కూడా ఏడాది క్రితం కంటే చాలా భిన్నమైన ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మన ముందు తరాలకు ప్రతినిధిగా వస్తున్న వీరికి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, భద్రతపరమైన ప్రపంచాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని యునిసెఫ్ డైరెక్టర్ హెనిరియెట్టా ఫోర్స్ అన్నారు.

Tags:    

Similar News