ఒడిషాలో 14 రోజుల పాటు..

దిశ, వెబ్ డెస్క్: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషాల్లో రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ వైపు అడుగులేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. తాజాగా ఒడిషా ప్రభుత్వం అక్కడ 14 రోజుల‌పాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఈసారి లాక్‌డౌన్‌ను రాష్ట్ర‌మంత‌టా కాకుండా క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్న‌ట్లు నవీన్ పట్నాయక్ స‌ర్కారు తెలిపింది. ఒడిశాలోని గంజామ్‌, […]

Update: 2020-07-16 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిషాల్లో రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ వైపు అడుగులేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. తాజాగా ఒడిషా ప్రభుత్వం అక్కడ 14 రోజుల‌పాటు కంప్లీట్ లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే ఈసారి లాక్‌డౌన్‌ను రాష్ట్ర‌మంత‌టా కాకుండా క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో మాత్ర‌మే అమ‌లు చేయ‌నున్న‌ట్లు నవీన్ పట్నాయక్ స‌ర్కారు తెలిపింది.

ఒడిశాలోని గంజామ్‌, ఖోర్ధా, క‌ట‌క్‌, జాజ్‌పూర్ జిల్లాల‌తోపాటు రూర్కెలా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఏరియాలో కంప్లీట్ లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్లు ఒడిశా ప్ర‌భుత్వం తెలిపింది. జూలై 17న‌ రాత్రి 9 గంట‌ల నుంచి జూలై 31న అర్ధరాత్రి వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగ‌తుంద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఒడిశా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అసిత్ త్రిపాఠీ పేరుతో ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Tags:    

Similar News