సందిగ్ధంలో ఆస్ట్రేలియా, ఇండియా టీ20 సిరీస్

దిశ, స్పోర్ట్స్: షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఇండియా, ఆస్ట్రేలియా జట్లు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ను అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తేదీలు ప్రకటించింది. వాస్తవానికి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరిగితే ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా ఉంటుందని భావించారు. టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధపడుతున్నది. ఈ నేపథ్యంలో […]

Update: 2020-07-24 07:38 GMT

దిశ, స్పోర్ట్స్: షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఇండియా, ఆస్ట్రేలియా జట్లు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌ను అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే తేదీలు ప్రకటించింది. వాస్తవానికి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ జరిగితే ఈ సిరీస్ ఇరు జట్లకు సన్నాహకంగా ఉంటుందని భావించారు. టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ సిద్ధపడుతున్నది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా, ఇండియా టీ20 సిరీస్ నిర్వహణ సందిగ్ధంలో పడింది. టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది కాబట్టి నవంబర్ ఆఖరులో ఈ సిరీస్ జరిపితే ఎలా ఉంటుందని ఇరు బోర్డులు భావించాయి. కానీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నది. ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడ క్వారంటైన్‌ తర్వాత టీ20 సిరీస్ ఆడితే టెస్ట్ సిరీస్‌కు సమయం సరిపోదు. అంతేకాకుండా టెస్టు సిరీస్ అనంతరం వన్డే సిరీస్, ఆ వెంటనే ఇంగ్లండ్‌తో సిరీస్ ఉంది. బిజీ షెడ్యూల్‌‌తో ఏం చేయాలా అనే మల్లగుల్లాలు పడుతున్నది. ఇంగ్లండ్ సిరీస్‌ను ఫిబ్రవరికి వాయిదా వేసి, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ ఏర్పాట్లలో తలమునకలై ఉండటంతో ఈ విషయమై స్పష్టత రావడానికి కాస్త సమయం పడుతుందని సమాచారం.

Tags:    

Similar News