13న మల్లేపల్లిలో జాబ్ మేళా..
దిశ, హైదరాబాద్ : నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్చి 13న విజయ్ నగర్ కాలనీ మల్లేపల్లి ఐటీఐ కళాశాల క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.లక్షణ్ కుమార్ తెలిపారు. ఎన్టీటీఎఫ్, హెచ్డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్, రిలియన్స్ జియో, ఎస్ఎల్ గ్రూపు, శ్రీమా సొల్యుషన్స్ అనే 5 ప్రయివేటు కంపెనీలలో హైదరాబాద్‌లో పనిచేయుటకు దాదాపు 310 మంది సిబ్బంది ఎంపిక ఉంటుందన్నారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, […]
దిశ, హైదరాబాద్ :
నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు మార్చి 13న విజయ్ నగర్ కాలనీ మల్లేపల్లి ఐటీఐ కళాశాల క్యాంపస్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.లక్షణ్ కుమార్ తెలిపారు. ఎన్టీటీఎఫ్, హెచ్డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్, రిలియన్స్ జియో, ఎస్ఎల్ గ్రూపు, శ్రీమా సొల్యుషన్స్ అనే 5 ప్రయివేటు కంపెనీలలో హైదరాబాద్‌లో పనిచేయుటకు దాదాపు 310 మంది సిబ్బంది ఎంపిక ఉంటుందన్నారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి, 19-30 సంవత్సరాల స్త్రీ, పురుషులు అర్హులన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.9 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు. అర్హత, ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మార్చి 13 శుక్రవారం మల్లేపల్లి ఐటీఐ కళాశాల క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు యంగ్ ప్రొఫెషనల్ టి.రఘుపతి 82476 56356 నెంబర్‌ను, హైదరాబాద్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు.
Tags: hyd, employment office,13 job mela, mallepalli, unemployed people