గోవధ ఆరోపణలతో 11 మందిపై ఎన్ఎస్ఏ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గోవధకు పాల్పడ్డారన్న అభియోగాలతో 11 మందిపై జాతీయ భద్రత చట్టం ప్రయోగించారు. బదౌన్ పోలీసులు ఈ చట్టం కింద అక్టోబర్ 8న అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను జిల్లా మెజిస్ట్రేట్‌కు పంపారని, తదుపరి ప్రక్రియను ముగించి మెజిస్ట్రేట్ జాతీయ భద్రత చట్టాన్ని ప్రయోగించారని ఏఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గురుపురి చందన్ గ్రామంలో కొందరు గోవధకు పాల్పడినట్టు తమకు సమాచారమందడంతో ఒక బృందం వెంటనే స్పాట్‌కు చేరిందని పోలీసులు వివరించారు. […]
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గోవధకు పాల్పడ్డారన్న అభియోగాలతో 11 మందిపై జాతీయ భద్రత చట్టం ప్రయోగించారు. బదౌన్ పోలీసులు ఈ చట్టం కింద అక్టోబర్ 8న అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి పూర్తి నివేదికను జిల్లా మెజిస్ట్రేట్‌కు పంపారని, తదుపరి ప్రక్రియను ముగించి మెజిస్ట్రేట్ జాతీయ భద్రత చట్టాన్ని ప్రయోగించారని ఏఎస్పీ ప్రవీణ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. గురుపురి చందన్ గ్రామంలో కొందరు గోవధకు పాల్పడినట్టు తమకు సమాచారమందడంతో ఒక బృందం వెంటనే స్పాట్‌కు చేరిందని పోలీసులు వివరించారు. నిందితులను పట్టుకున్నారని, 200 కిలోల మాంసం, చర్మం, ఇతర అవయవాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వధించడానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని, వెంటనే వెటరినరీ డాక్టర్‌ను పిలిపించగా, ఆ మాంసం బీఫ్ అనే ధ్రువీకరించారని పేర్కొన్నారు. దీంతో 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు బీనవార్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో రాజీవ్ కుమార్ వివరించారు.