టెర్రరిస్టులతో లింకులు.. 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్

శ్రీనగర్ : ఉగ్రవాదులకు తోడ్పాటునందిస్తున్నారని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 11 మందిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందులో ఇద్దరు పోలీసులూ ఉన్నారు. వీరు పోలీసుల వివరాలను ఉగ్రవాదులకు చేరవేస్తున్నారని ఆరోపణలున్నాయి. మే నెలలోనూ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా తొలగించిన 11 మందిలో ఇద్దరు టెర్రరిస్టు సలాహుద్దీన్ కుమారులున్నారు. మెడికల్ అసిస్టెంట్ సయ్యద్ షకీల్ యూసుఫ్, వ్యవసాయ శాఖలో సేవలందిస్తున్న సయ్యద్ షహీద్ […]

Update: 2021-07-10 20:15 GMT

శ్రీనగర్ : ఉగ్రవాదులకు తోడ్పాటునందిస్తున్నారని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 11 మందిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందులో ఇద్దరు పోలీసులూ ఉన్నారు. వీరు పోలీసుల వివరాలను ఉగ్రవాదులకు చేరవేస్తున్నారని ఆరోపణలున్నాయి. మే నెలలోనూ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ తొలగించిన సంగతి తెలిసిందే.

తాజాగా తొలగించిన 11 మందిలో ఇద్దరు టెర్రరిస్టు సలాహుద్దీన్ కుమారులున్నారు. మెడికల్ అసిస్టెంట్ సయ్యద్ షకీల్ యూసుఫ్, వ్యవసాయ శాఖలో సేవలందిస్తున్న సయ్యద్ షహీద్ యూసుఫ్‌లు సలాహుద్దీన్ కుమారులు. సలాహుద్దీన్ ఐదుగురు కొడుకులూ ఏదో శాఖలో ప్రభుత్వరంగంలో పనికి కుదరడం గమనార్హం.

Tags:    

Similar News