2 రోజుల్లో వెయ్యి.. కరోనా హాట్‌స్పాట్‌గా కుంభమేళా!
డెహ్రాడూన్: లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు.. మాస్కుల్లేవు! భౌతిక దూరం ఊసే లేదు!! ఎటు చూసినా జన జాతరే. దేశంలో ఒకవైపు కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళా ఉత్సవం వైరస్ వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండ్రోజుల్లోనే అక్కడ వేయి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇవి అధికారిక లెక్కలే. అనధికారికంగా అంతకు ఎక్కువే ఉండొచ్చునని వైద్యాధికారులు భావిస్తు్న్నారు. కరోనా నిబంధనలను గంగలో […]
డెహ్రాడూన్: లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు.. మాస్కుల్లేవు! భౌతిక దూరం ఊసే లేదు!! ఎటు చూసినా జన జాతరే. దేశంలో ఒకవైపు కరోనా రెండో దశ విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళా ఉత్సవం వైరస్ వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారిందా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండ్రోజుల్లోనే అక్కడ వేయి మందికి పైగా కరోనా బారిన పడ్డారు. ఇవి అధికారిక లెక్కలే. అనధికారికంగా అంతకు ఎక్కువే ఉండొచ్చునని వైద్యాధికారులు భావిస్తు్న్నారు.
కరోనా నిబంధనలను గంగలో తొక్కి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. ముక్తితో పాటు వైరస్‌నూ వెంట తీసుకెళ్తున్నారు. కుంభమేళా జరుుగుతున్న హరిద్వార్‌లో సోమవారం 408 కేసులు రాగా.. మంగళవారం 594 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో ఉత్తరాఖండ్ లో 1,925 కేసులు రాగా, 13 మంది మరణించారు. కొత్త కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.12 లక్షలు దాటింది. 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళాలో పవిత్ర గంగానదిలో స్నానమాచరించడానికి దేశవ్యాప్తంగా భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు. అయితే కరోనా నిబంధనలను గాలికొదిలేయడంతో అక్కడ వైరస్ వ్యా్ప్తి ఆందోళనకరంగా పెరుగుతుంది. ఈ కారణంగా రాబోయే రోజుల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లలో కరోనా స్వైర విహారం తప్పకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.