నటుడిగా ఆవిష్కరించిన ‘ఖలేజా’ : మహేశ్

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబులోని కామెడీ యాంగిల్‌ను చూపించిన సినిమా ‘ఖలేజా’. దేవుడు ఎక్కడో లేడు, నిస్వార్థంగా సహాయం చేయాలనుకునే మనిషిలోనే ఉంటాడనే యూనిక్ స్టోరీ లైన్‌తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఫ్రేమ్ ఫ్రేమ్‌కు.. సీన్ సీన్‌కు కామెడీని యాడ్ చేసిన ప్రిన్స్ తన కామెడీ టైమింగ్‌కు ఫిదా అయ్యేలా చేశాడు. ఫస్ట్ టైమ్ కామెడీ బేస్ సినిమా చేసిన మహేశ్‌ను […]

Update: 2020-10-07 00:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబులోని కామెడీ యాంగిల్‌ను చూపించిన సినిమా ‘ఖలేజా’. దేవుడు ఎక్కడో లేడు, నిస్వార్థంగా సహాయం చేయాలనుకునే మనిషిలోనే ఉంటాడనే యూనిక్ స్టోరీ లైన్‌తో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైన్మెంట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఫ్రేమ్ ఫ్రేమ్‌కు.. సీన్ సీన్‌కు కామెడీని యాడ్ చేసిన ప్రిన్స్ తన కామెడీ టైమింగ్‌కు ఫిదా అయ్యేలా చేశాడు. ఫస్ట్ టైమ్ కామెడీ బేస్ సినిమా చేసిన మహేశ్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారని.. సినిమా డిజాస్టర్ అని టాక్ వచ్చినా సరే.. బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. ఆయన కామెడీని ఆస్వాదిస్తూ థియేటర్లన్నీ నవ్వులతో నిండిపోయాయి.

ఓ చిన్న మారుమూల పల్లె దేవుడి కోసం ఎదురుచూస్తుండటం.. ఆ దేవుడు మహేశ్ బాబు అని నిర్ధారించుకోవడం.. తమ కష్టాలను ఎడబాపే దేవుడు తనే అని గ్రామస్తులంతా చెప్తూ.. ‘నువ్వు మా దేవుడివి అని నువ్వు నమ్మే పనిలేదు.. మాకు నమ్మించే అక్కరా లేదు.. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ లాంటి ఎమోషనల్ సీన్స్ సినిమాకు హైలెట్ కాగా.. అక్కడ కూడా మహేశ్ కామెడీని సూపర్‌గా ఎంజాయ్ చేశారు, చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు. డిజాస్టర్ టాక్‌తో థియేటర్స్‌లో సినిమా చూడని ప్రేక్షకులు.. టీవీల్లో సినిమా చూసి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ అందుకున్నారు. థియేటర్స్‌లో సినిమా ఎందుకు చూడలేదా? అని ఫీల్ అయినవాళ్లు కూడా ఉన్నారు.

ఏదేమైనా పదేళ్లు పూర్తి చేసుకున్న ఖలేజా సినిమా.. నటుడిగా తనను ఆవిష్కరించిందని, ఈ సినిమా ఎప్పటికీ స్పెషల్ అని చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు మహేశ్. ఈ చిత్రాన్ని అందించిన స్నేహితుడు, అమేజింగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

Tags:    

Similar News