హైదరాబాద్‌కు రూ. 10వేల కోట్లు

దిశ, న్యూస్ బ్యూరో‌: రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నగరానికి రూ.10వేల కోట్లను కేటాయించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగా ఈ ఏడాది రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఢీల్లీ తర్వాత రెండో అతి పెద్ద మెట్రో సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ మెట్రో.. రెండో దశ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. రెండోదశలో భాగంగా ఎల్బీనగర్ […]

Update: 2020-03-08 03:06 GMT

దిశ, న్యూస్ బ్యూరో‌: రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ నగరానికి రూ.10వేల కోట్లను కేటాయించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ది చేసేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగా ఈ ఏడాది రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఢీల్లీ తర్వాత రెండో అతి పెద్ద మెట్రో సర్వీసులు అందిస్తున్న హైదరాబాద్ మెట్రో.. రెండో దశ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. రెండోదశలో భాగంగా ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ, తార్నాక నుంచి ఈసీఐఎల్.. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకూ మెట్రోను పొడగించనున్నారు.

tag; budget, hyderabad, location, 10 thousand crore

Tags:    

Similar News