భారత్, చైనాల పదో దఫా మిలిటరీ చర్చలు.. ఆ అంశం పైనే ఫోకస్

న్యూఢిల్లీ: భారత్, చైనాలు శనివారం పదో దఫా మిలిటరీ చర్చలు నిర్వహించాయి. తూర్పు లడాఖ్‌లో ఉద్రిక్తతలు తొలగించడానికి హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సాంగ్ ఏరియాల్లోనూ ఉభయ దేశాల బలగాల ఉపసంహరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. సరిహద్దుకు చైనా భూభాగంలోని చుషుల్ మోల్డోలో కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. శనివారం ఉదయం పది గంటలకే ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. లడాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు తీరంలో దాదాపు తొమ్మిది నెలలపాటు సాగిన ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పెడుతూ రెండు దేశాల […]

Update: 2021-02-20 11:23 GMT
భారత్, చైనాల పదో దఫా మిలిటరీ చర్చలు.. ఆ అంశం పైనే ఫోకస్
  • whatsapp icon

న్యూఢిల్లీ: భారత్, చైనాలు శనివారం పదో దఫా మిలిటరీ చర్చలు నిర్వహించాయి. తూర్పు లడాఖ్‌లో ఉద్రిక్తతలు తొలగించడానికి హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సాంగ్ ఏరియాల్లోనూ ఉభయ దేశాల బలగాల ఉపసంహరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. సరిహద్దుకు చైనా భూభాగంలోని చుషుల్ మోల్డోలో కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. శనివారం ఉదయం పది గంటలకే ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు.

లడాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు తీరంలో దాదాపు తొమ్మిది నెలలపాటు సాగిన ఉద్రిక్తతలకు ఫుల్‌స్టాప్ పెడుతూ రెండు దేశాల సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన రెండు రోజుల తర్వాత ఈ భేటీ జరగడం గమనార్హం. తొమ్మిదో దఫా చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు ప్యాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి ఉభయ దేశాల సైన్యం, ఆయుధ సామగ్రి వెనక్కి వెళ్లిన రెండు రోజుల తర్వాతే సమావేశమయ్యారు. ఈ భేటీలో హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సాంగ్ ఏరియాల్లో వేగంగా బలగాల ఉపసంహరణ చేపట్టాలని భారత్ ప్రతిపాదించనున్నట్టు తెలిసింది.

Tags:    

Similar News