ఉత్తరాఖండ్‌లో హిమపాతం.. 10 మంది మృతి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మరోసారి మంచుచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం చమోలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 10 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం ఆర్మీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తు్న్నది. ఇప్పటి వరకు 384 మందిని కాపాడింది. కాగా, కనీసం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఆరుగురిని జోషిమాత్‌లోని హాస్పిటల్‌లో చేర్చగా, మరొకరిని డెహ్రాడూన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. సుమ్నా సమీపంలోని హిమానీనదానికి చెందిన […]
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో మరోసారి మంచుచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం మధ్యాహ్నం చమోలీ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో 10 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు మరణించారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం ఆర్మీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తు్న్నది. ఇప్పటి వరకు 384 మందిని కాపాడింది. కాగా, కనీసం ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఆరుగురిని జోషిమాత్‌లోని హాస్పిటల్‌లో చేర్చగా, మరొకరిని డెహ్రాడూన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు.
సుమ్నా సమీపంలోని హిమానీనదానికి చెందిన కొన్ని చరియలు విరిగి సుమ్నా-రిమ్‌ఖిమ్ రోడ్డుపై పడ్డాయి. ఇక్కడే బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడే చరియలు విరిగిపడటంతో చాలా మంది కార్మికులు ప్రమాదంలో పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ రంగంలోకి దిగి 384 మంది కార్మికులను కాపాడగలిగింది. ఈ ప్రాంతంలో ఐదు రోజులుగా భారీగా మంచు, వర్షం పడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. సీఎం తీరథ్ సింగ్ రావత్, రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్‌లు ఏరియల్ సర్వే చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని హామీనిచ్చారని సీఎం వెల్లడించారు.