10మంది అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్ట్

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో 10మంది అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన కాక్రల్ గ్యాంగ్.. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ జ్యుయలరీ షాపుల్లో చోరీలు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా పండ్ల వ్యాపారం చేస్తుంటారు. అయితే చోరీ చేసే సమయంలో ఎవరైన ప్రతిఘటిస్తే వారిపై మారణాయుధాలతో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడరు. కొద్దిరోజులుగా వీరిపై నిఘా ఉంచిన పోలీసులు శనివారం అరెస్ట్ చేసి నిందితుల నుంచి […]

Update: 2020-08-29 11:34 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్‌లో 10మంది అంతర్‌రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీకి చెందిన కాక్రల్ గ్యాంగ్.. జగద్గిరిగుట్టలో నివాసం ఉంటూ జ్యుయలరీ షాపుల్లో చోరీలు చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా పండ్ల వ్యాపారం చేస్తుంటారు. అయితే చోరీ చేసే సమయంలో ఎవరైన ప్రతిఘటిస్తే వారిపై మారణాయుధాలతో ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడరు. కొద్దిరోజులుగా వీరిపై నిఘా ఉంచిన పోలీసులు శనివారం అరెస్ట్ చేసి నిందితుల నుంచి డీసీఎం, బైక్‌తో పాటు, రెండు రివాల్వర్లు, 15 బుల్లెట్లు, ఇళ్ల తాళాలు బ్రేక్ చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జ్యుయలరీ దుకాణాలు, బ్యాంకులలో అలారాలు ఏర్పాటు చేసుకోవాలని, తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉండాలని సీపీ సూచించారు.

Tags:    

Similar News