‘వారికి 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి’
ప్యారిస్: కరోనా విజృంభణ తరుణంలో భారత ప్రయాణికులను తప్పనిసరిగా పది రోజులు క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పది రోజుల క్వారంటైన్ నిబంధనను విధిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి గ్యాబ్రియెల్ అట్టాల్ బుధవారం తెలిపారు. ఇటీవలే బ్రెజిల్ నుంచి వచ్చే ప్రయాణికులపై ప్యారిస్ పూర్తి నిషేధం ప్రకటించింది. అర్జెంటినా, చిలీ, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో గడపాలని ఆదేశించింది. కాగా, భారత్ […]
ప్యారిస్: కరోనా విజృంభణ తరుణంలో భారత ప్రయాణికులను తప్పనిసరిగా పది రోజులు క్వారంటైన్‌లో ఉంచనున్నట్టు ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై పది రోజుల క్వారంటైన్ నిబంధనను విధిస్తున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి గ్యాబ్రియెల్ అట్టాల్ బుధవారం తెలిపారు. ఇటీవలే బ్రెజిల్ నుంచి వచ్చే ప్రయాణికులపై ప్యారిస్ పూర్తి నిషేధం ప్రకటించింది. అర్జెంటినా, చిలీ, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో గడపాలని ఆదేశించింది. కాగా, భారత్ నుంచి ప్రయాణాలను బ్రిటన్, హాంకాంగ్‌లు ఇటీవలే బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.