టార్గెట్ ‘10/10’
దిశ, మేడ్చల్ : జిల్లా విద్యాశాఖ పదో తరగతి వార్షిక ఫలితాల్లో నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. టెంత్ పరీక్షలు స్టార్టయ్యేందుకు సరిగ్గా 14 రోజులు సమయం. దాదాపు 43వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. మార్చి 19 నుంచి పదో తరగతి పరీక్షలు. రోజురోజూకీ పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులతో పాటు జిల్లా పాఠశాల విద్యాశాఖ పరుగులు పెడుతోంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా చూస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలో […]
దిశ, మేడ్చల్ : జిల్లా విద్యాశాఖ పదో తరగతి వార్షిక ఫలితాల్లో నూటికి నూరు శాతం ఫలితాలు రాబట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. టెంత్ పరీక్షలు స్టార్టయ్యేందుకు సరిగ్గా 14 రోజులు సమయం. దాదాపు 43వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. మార్చి 19 నుంచి పదో తరగతి పరీక్షలు. రోజురోజూకీ పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులతో పాటు జిల్లా పాఠశాల విద్యాశాఖ పరుగులు పెడుతోంది. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా చూస్తోంది. మేడ్చల్ జిల్లా పరిధిలో పదో తరగతి పరీక్షలు రాసేవారిలో 7500 మంది ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు కాగా, 35వేల మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో ఇదీ పరిస్థితి..
జిల్లా పరిధిలో 503 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 103 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 8 మైనార్టీ సంక్షేమ పాఠశాలలు, 5 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ఐదు బీసీ గురుకులాలు, 12 ఎయిడెడ్ పాఠశాలలు, ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. ఈ పాఠశాలల పరిధిలో 7500 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇకపోతే జిల్లాలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య 1303. వీటి పరిధిలో 35 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
ప్రైవేటు వారికే అధికంగా 10/10 జీపీఏ..
పరీక్షల్లో ఏటా 9 జీపీఏ నుంచి 10/10 జీపీఏ సాధించే విద్యార్థుల్లో ప్రైవేటు వారే అధికంగా ఉంటున్నారు. ప్రభుత్వ బడుల్లో కేవలం పది మంది విద్యార్థుల్లోపే 10/10 సాధిస్తుండటం గమనార్హం. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఈసారి ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కంటే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులే అధిక సంఖ్యలో 10/10 సాధించేలా విద్యా సంవత్సరం మొదట్నుంచీ ప్రయత్నించారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల బలాబలాలపై ఓ స్పష్టతకొచ్చారు. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతులను జిల్లా పరిధిలో అమలు చేశారు. పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులందరికీ తరగతులతో సంబంధం లేకుండా పదో తరగతి విద్యార్థుల బాధ్యతలను అప్పగించారు. విద్యార్థులను ఐదు నుంచి పది మంది కలిపి ఒక బృందంగా తయారుచేసి.. విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేశారు. ఈనెల 19వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మానసికంగా విద్యార్థులను దృఢం చేస్తున్నారు. ఏదీఏమైనా ఈ యేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10/10 జీపీఏ అధిక శాతం సాధించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
tags : medchal education dept, telangana state, govt school students