ఈఎస్ఐ కేసులో కీలక పరిణామం
దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవికారాణికి చెందిన రూ.1.99కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్ కంపెనీల్లో దేవికారాణి, ఆమె కుటుంబసభ్యులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు బుధవారం దేవికారాణికి చెందిన రూ.1.99కోట్ల డీడీని స్వాధీనం చేసుకున్నారు. అటు.. రియల్ ఎస్టేట్‌లో సైతం పెట్టుబడులు పెట్టిన దేవికారాణి నుంచి రూ.4.47 కోట్లతో పాటు రూ.2.27కోట్ల డీడీలను ఏసీబీ అధికారులు […]
దిశ, వెబ్‌డెస్క్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవికారాణికి చెందిన రూ.1.99కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు తమిళనాడులోని చిట్‌ఫండ్ కంపెనీల్లో దేవికారాణి, ఆమె కుటుంబసభ్యులు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు బుధవారం దేవికారాణికి చెందిన రూ.1.99కోట్ల డీడీని స్వాధీనం చేసుకున్నారు. అటు.. రియల్ ఎస్టేట్‌లో సైతం పెట్టుబడులు పెట్టిన దేవికారాణి నుంచి రూ.4.47 కోట్లతో పాటు రూ.2.27కోట్ల డీడీలను ఏసీబీ అధికారులు గతంలోనే స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.