హోంశాఖకు రూ.1.66 లక్షల కోట్లు
దిశ, క్రైమ్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి హోంశాఖకు రూ.1.66 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హోం శాఖకు గతేడాది కంటే ఈ ఏడాది కేటాయింపులను తగ్గించారు. దేశ వ్యాప్తంగా గతేడాది రూ.1,67,250 కోట్ల బడ్జెన్‌ను హోంశాఖకు కేటాయించగా 2021-22 సంవత్సరానికి రూ.1,66,546 కోట్లను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వీటిలో మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫెయిర్స్‌కు రూ.7,620.40 కోట్లు, క్యాబినెట్‌కు రూ.2098.04 […]
దిశ, క్రైమ్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి హోంశాఖకు రూ.1.66 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో హోం శాఖకు గతేడాది కంటే ఈ ఏడాది కేటాయింపులను తగ్గించారు. దేశ వ్యాప్తంగా గతేడాది రూ.1,67,250 కోట్ల బడ్జెన్‌ను హోంశాఖకు కేటాయించగా 2021-22 సంవత్సరానికి రూ.1,66,546 కోట్లను కేటాయించినట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. వీటిలో మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫెయిర్స్‌కు రూ.7,620.40 కోట్లు, క్యాబినెట్‌కు రూ.2098.04 కోట్లు, పోలీస్‌కు రూ.1.03,802.52 కోట్లు, అండమాన్ అండ్ నికోబర్ దీవులకు రూ.5317.41 కోట్లు, చండిఘర్‌కు 4661.12 కోట్లు, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలకు రూ.2204.59 కోట్లు, లడాఖ్‌కు రూ.5958 కోట్లు, లక్ష్యదీప్‌కు రూ.1440.56 కోట్లు, ఢిల్లీకి రూ.957.51 కోట్లు, జమ్మూ కాశ్మీర్‌కు రూ.30,757 కోట్లు, పాండిచ్చేరికి రూ.1729 కోట్లను కేంద్రం కేటాయించింది.
మొత్తం రూ.34.83 లక్షల కోట్ల బడ్జెట్ లో హోం శాఖకు రూ.1.66 లక్షల కోట్లను కేటాయించింది. వీటిలో డిజిస్టార్ మేనేజ్మెంట్ కు రూ.481.61 కోట్లు, నేషనల్ హుమన్ రైట్స్ కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) కు రూ.62.33 కోట్లు, సీఆర్‌పీఎఫ్, ఎన్ఎస్‌జీ, బీఎస్ఎఫ్ తదితర కేంద్ర బలగాలకు రూ.77,838 కోట్లను కేటాయించారు. భవనాలు తదితర మౌలిక సదుపాయాలకు రూ.3612.29 కోట్లు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రూ.5 కోట్ల ప్రకటించారు. ఇదిలా ఉండగా, మహిళా భద్రతకు 2020-21 ఏడాదిలో వాస్తవానికి రూ.855.23 కోట్లు కేటాయించగా, రివైజ్డ్ బడ్జెట్ లో రూ.171.63 కోట్లు కుదించారు. కానీ, ఈ ఏడాది 2021-22లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, ఈ బడ్జెట్ ను నిర్భయ ఫండ్ నుంచి మళ్లించనున్నారు. గతేడాది హోం గార్డులకు రూ.82 వేల కోట్లను కేటాయించగా, ఈ ఏడాది కేవలం రూ.2 లక్షలను మాత్రమే కేటాయించారు. ఇదిలా ఉండగా, రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లను కేంద్రం కేటాయించింది.