ఉద్దానం తాగునీటి కోసం 1.12 టీఎంసీలు

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తాగునీటి కోసం 1.12 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హీర మండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానం తాగునీటి కోసం సరఫరా చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రత దృష్ట్యా అత్యవసరంగా ఆ ప్రాంతంలో తాగునీటి సరఫరాను మార్పు చేస్తూ ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా […]

Update: 2020-10-19 10:55 GMT
దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం తాగునీటి కోసం 1.12 టీఎంసీల నీటిని కేటాయిస్తూ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హీర మండలం రిజర్వాయర్ నుంచి ఉద్దానం తాగునీటి కోసం సరఫరా చేసేందుకు కార్యాచరణ చేపట్టనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి తీవ్రత దృష్ట్యా అత్యవసరంగా ఆ ప్రాంతంలో తాగునీటి సరఫరాను మార్పు చేస్తూ ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా ఇంజినీర్ ఇన్ చీఫ్ ను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Tags:    

Similar News