- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేట్ మెసేజ్‌తో ‘హిచ్కి’ షార్ట్‌ఫిల్మ్
దిశ, వెబ్ డెస్క్: కొందరికి మనం ఏమీ కాకపోవచ్చు. కానీ, వారికి మాత్రం మనమే అన్నీ అవుతాం. అలాంటి వ్యక్తులు మనకోసం రోడ్ల మీద వెతుకుతున్నారు. వారే రోడ్డు పక్కన భిక్షం ఎత్తుకుని జీవించే చిన్నారులు. దేశంలో దాదాపు రెండు మిలియన్ మంది చిన్నారులు ఇలా మీకోసం ఎదురుచూస్తున్న వారే. మీరు ఇచ్చే చిల్లరతో కడుపునింపకుని రోజూ మీ పేరు తలుచుకునే వారే. వీరిలో దాదాపు 80% మందికి గుర్తింపు లేదు. అయితే, ఇప్పుడు ఆకలి కన్నా కూడా పెద్ద ముప్పు కరోనా. ఈ మహమ్మారి బారిన పడి ఆ చిన్నారులు ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వారిని చేరదీద్దాం. ఆహారంతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు అందిద్దాం.. సరైన జాగ్రత్తలు చెబుతూ ఈ కొవిడ్ మహమ్మారి నుంచి వారిని కాపాడుకుందాం అనే మెసేజ్‌తో తెరకెక్కింది హిందీ షార్ట్ ఫిల్మ్ ‘హిచ్కి’.
మనీష్‌పాల్, ముక్తిమోహన్ నటించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను మనీష్‌పాల్, రఘువేంద్రసింగ్ నిర్మించగా కులిష్‌కాంత్ ఠాకూర్ దర్శకత్వం వహించారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ ఫిల్మ్‌ను మెచ్చుకున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. మీకు ఎక్కిళ్లు వస్తే ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు అని, ఆ పేరు మీరు చెప్తే వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి అని ఒక నమ్మకం ఉంది. అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ, మంచి మెసేజ్ యాడ్ చేసి తెరకెక్కించిన ఫిల్మ్‌కు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.