బై పోల్ రిజల్ట్.. బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్.. ఏమన్నారంటే.?

by Anukaran |
బై పోల్ రిజల్ట్.. బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్.. ఏమన్నారంటే.?
X

దిశ, కరీంనగర్ ప్రతినిధి : హుజురాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో 13వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,300 పై చిలుకు ఓట్లతో టీఆర్ఎస్‌పై ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు ఫోన్ చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఈటలకు, రాష్ట్ర బీజేపీ నేతలకు, కార్యకర్తలకు, అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఉప ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లనే బీజేపీ గెలుస్తోందని అమిత్ షాకు బండి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed