- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎయిమ్స్ నుంచి అమిత్ షా డిశ్చార్జ్

X
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఉదయం ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని శనివారం ఎయిమ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హోం మంత్రి అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. కరోనా నుంచి కోలుకున్నారని, వైద్యుల సూచనల మేరకు హోం ఐసొలేషన్‌లో ఉంటారని అమిత్ షా ఆగస్టు 14న ట్వీట్ చేశారు. అనంతరం అలసట, ఒళ్లు నొప్పులతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 18వ తేదీన అడ్మిట్ అయ్యారు. కరోనానంతర చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్టు ఎయిమ్స్ అప్పుడు ప్రకటించింది. ఆయన ఆరోగ్యం కోలుకున్న తర్వాత సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి డిశ్చార్జీ అయ్యారు. అనంతరం ఓనమ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం గమనార్హం.
Next Story