- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిజిస్ట్రేషన్లపై సందిగ్ధత.. హైకోర్టు ఆదేశాలే కీలకం
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఐతే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉందని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. కోర్టు స్టే తొలగించిన వెంటనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. నేడు (23 న) కోర్టు విచారణ ఉన్నందున, 25 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఏ ఆస్తికి ఎంత విలువ అనేది అధికారులు నిర్ధారించారని, దాన్ని మార్చే విచక్షణాధికారం ఎవరికీ లేదని మరోసారి సీఎం ఉద్ఘాటించారు. అయితే హైకోర్టు ఆదేశాలే కీలకంగా మారనున్నాయి.
ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాల్టీ, జీహెచ్ఎంసీ చట్టాలను సవరించినట్లు పేర్కొన్నారు. ధరణిలో రాష్ట్రంలోని 1.06 కోట్ల ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. అలాగే ఆస్తుల నమోదులో కుల ప్రస్తావన ఉండదని స్పష్టం చేసింది. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి సామాజిక వర్గం వివరాలు మాత్రమే సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సేకరించిన వివరాలన్నీ రాష్ట్ర డేటా సెంటర్ లో అత్యంత భద్రంగా ఉంటాయి. వ్యవసాయేతర ఆస్తుల యజమానుల ఆధార్ వివరాల కోసం ఒత్తిడి చేయమని, వ్యవసాయ భూములకు రైతుబంధు వంటి సబ్సిడీ పథకాలు అమలవుతున్నాయన్నారు. సాగు భూముల యజమానుల ఆధార్ వివరాల సేకరణ తప్పేమి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ధరణి ఆస్తుల నమోదుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది.
కసరత్తు వేగవంతం..
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆరంభించిన తొలి రోజుల్లో కేవలం సేల్ డీడ్స్ మాత్రమే కొనసాగిస్తారని సమాచారం. మిగతా రకాల లావాదేవీల నిర్వహణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 1999 లో కార్డ్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆరంభించినప్పుడు కూడా తొలుత కేవలం సేల్ డీడ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఒక్కొక్క సర్వీసును పెంచారు. ఇప్పుడూ ధరణి పోర్టల్ పార్టు 2 ద్వారా అదే తరహా విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ కే భవన్ లోని వార్ రూంలో ధరణి సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు కసరత్తు వేగవంతం చేశారు.
వ్యవసాయం, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలు నడిచినప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్, ఆటోమెటిక్ మ్యుటేషన్ చేయించాలని సీఎం కేసీఆర్ ఆశయంగా అధికారులు ఆదేశించారు. కానీ దాని ద్వారా కొత్త సమస్యలు తలెత్తకుండా చూడాలని కూడా సూచించారు. అందుకు అనుగుణంగానే సాంకేతికత దన్ను ఉండాలని అధికారులకు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వార్ రూంలోనే ఉంటూ కావాల్సిన చేర్పులు, మార్పులను చేయించుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారులతో పాటు ప్రతి జిల్లా నుంచి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు కూడా వార్ రూంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించడం, పరిష్కార మార్గాలను సూచించడం వంటివి చేస్తున్నారని తెలిసింది.
ఓ జిల్లా అధికారి శనివారం ఉదయం 10 గంటలకు బీఆర్ కే భవన్ కు వెళ్లి ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు బయటికొచ్చిన సందర్భాలు ఉన్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఆ స్థాయిలో కసరత్తు సాగుతుందంటున్నారు. ఐతే పొరపాట్లు జరిగిప్పుడు జిల్లా అధికారి అనుమతితో ఒరిజినల్ పత్రాలను పరిశీలించి సవరించే అధికారం సబ్ రిజిస్ట్రార్ కు ఉండేది. రానున్న రోజుల్లో అలాంటి విచక్షణాధికారాలకు కోత పడనున్నాయి. ఎలాంటి పొరపాట్లు జరిగినా సవరించేందుకు వ్యవస్థ ఉంటుందో, ఉండదోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.