- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.. ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహ ధ్వంసం చోటుచేసుకోగా, మంగళవారం ఘటనా స్థలాన్ని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కాడే, జిల్లా ఎస్‌పీ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ నేపథ్యంలో పట్టణానికి చెందిన అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ సభ్యులు కలెక్టర్‌కి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాతకి ఇలాంటి అవమానం జరగటం జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. పట్టణంలో శాంతిభద్రతల విషయంలో భాగంలో స్టాచ్యూ కమిటీ పోలీసులకు పూర్తి సహకారాలు అందించనున్నట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, భవిష్యత్తులో ఇక్కడ విగ్రహ ఏర్పాటు అనంతరం పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ఇట్టి విషయాలకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
పట్టణంలో శాంతి భద్రత నెలకొల్పడానికి పోలీసులకి మీ వంతు సహాయం కమిటీ తరఫున అందించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ చేతుల మీదుగా ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల చెక్కుని కమిటీ సభ్యులకు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏఎస్పీ కిరణ్ కారే, సీఐ ప్రవీణ్ కుమార్, పట్టణ పోలీసులు, దళిత సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.