వోగ్ మ్యాగజైన్‌పై యంగెస్ట్ పోయెట్

by vinod kumar |
వోగ్ మ్యాగజైన్‌పై యంగెస్ట్ పోయెట్
X

దిశ, ఫీచర్స్ : అమెరికా దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో తన కవిత్వంతో అందరినీ ఆకట్టుకున్న యువతి అమండా గోర్మన్. ప్రజల ఆకాంక్షలు, యువత ఆలోచనలకు ప్రతిరూపంగా ఆమె చెప్పిన కవితకు అందరూ ఫిదా కాగా.. అమెరికా మరింతగా పురోగమించాలని, ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆమె ఆకాంక్షించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుల పదవీ స్వీకార సందర్భాల్లో పాల్గొన్న కవులందరికన్నా అత్యంత పిన్న వయస్కురాలిగా ఘనత సాధించిన అమండా.. ఇదివరకే టైమ్ కవర్ మ్యాగజైన్‌పై కూడా మెరిసింది. ఇక ప్రస్తుతం వోగ్స్ సంచిక ముఖచిత్రంగా తళుక్కుమని, ఈ ఘనత అందుకున్న తొలి పోయెట్‌గా చరిత్ర సృష్టించింది.

అమండా గోర్మాన్ ఓవైపు కవిగా సత్తా చాటుతూనే.. యాక్టివిస్ట్‌గానూ పేరుతెచ్చుకుంది. అణచివేత, స్త్రీవాదం, జాతి, అలాగే ఆఫ్రికన్ డయాస్పోరా సమస్యల చుట్టూ తన గళాన్ని వినిపించింది. ఈ క్రమంలోనే అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారోత్సవ వేళ తన చెప్పిన కవిత్వంతో ఆమె పేరు మారుమోగిపోయింది. ఈ మేరకు వోగ్ మ్యాగజైన్ తాజాగా అమండా కవర్ ఫొటోతో కూడిన రెండు కవర్ పేజీలను విడుదల చేయడం విశేషం. ఈ ముఖచిత్రాన్ని వోగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకుంది. ఈ ఫొటోతో పాటు ‘కవి, కార్యకర్త, ఆప్టిమిస్ట్, స్టైల్ ఐకాన్ – అమండా గోర్మన్ లిటరరీ స్టార్‌ను మించి పోయింది’ అనే కామెంట్ జతచేసింది. కాగా అమండా కవర్ ఫొటోలను ఫొటోగ్రాఫర్ లీబోవిట్జ్ చిత్రీకరించాడు.

Advertisement

Next Story