లేట్ నైట్ ఫ్యాన్స్‌ను కలిసిన బన్ని.. వీడియో వైరల్

by Shyam |
లేట్ నైట్ ఫ్యాన్స్‌ను కలిసిన బన్ని.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ మూవీ భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో నేషనల్ వైడ్‌గా మాసివ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్ని..నెక్స్ట్ ప్రాజెక్ట్ సుకుమార్ కాంబినేషన్‌లో చేస్తున్నాడు. ‘పుష్ప’ టైటిల్‌తో వస్తున్న చిత్రం ఆగస్టు 13న బిగ్ స్క్రీన్స్‌‌ను టచ్ చేయనుండగా..ఇప్పటికే రిలీజైన బన్ని లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. రఫ్ లుక్‌లో కనిపిస్తున్న స్టైలిష్ స్టార్ అభిమానుల్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే ధీమాను తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో శరవేగంగా జరుగుతుండగా..వందల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో లేట్ నైట్ సెట్స్‌కు చేరుకున్న ఫ్యాన్స్ నిరాశపరచకుండా వారిని కలిసిన అల్లు అర్జున్.. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌‌గా నటిస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ చేయనున్నాడు బన్ని.

Advertisement

Next Story

Most Viewed