- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెచ్చిపోయిన బన్నీ ఫ్యాన్స్.. బిగ్ షాకిచ్చిన అల్లు అర్జున్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: అభిమానుల దెబ్బకు బన్నీ ప్లాన్స్ మార్చుకున్నాడట. ఎన్ కన్వెన్షన్ హాల్ వద్ద అభిమానుల గలాటా కారణంగానే బన్నీ తన మనసు మార్చుకున్నాడు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీ అయిపోయాడు. తనకున్న పూర్తి సమయాన్ని సినిమా కోసమే వెచ్చిస్తున్నాడు. తన తాజా సినిమా ‘పుష్ప’తో ఎలాగైనా పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్ డమ్ అందుకోవాలన్నది బన్నీ ప్లాన్. అదే స్థాయిలో సినిమాకు హైప్ వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో బన్నీ తన ఫ్యాన్స్‌ను కలిసి వారితో ఫోటోలు దిగాలని ఆలోచించాడు. అందుకు కావలసిన అనుమతులను సైతం పోలీసుల దగ్గర తీసుకున్నాడు. ఈ మేరకు విషయం బన్నీ అభిమాన సంఘాలకు తెలిసింది. దీంతో వారు గీతా ఆర్ట్స్, ఎన్ కన్వెన్షన్ హాల్‌కు భారీగా తరలి వచ్చారు. ఎన్ కన్వెన్షన్ హాలు వద్ద బన్నీ తన అభిమానుల కలుసుకోనున్నాడు. బన్నీతో ఫొటో దిగాలన్న ఆరాటంతో అభిమానుల మధ్య తోపులాట జరిగింది. దీంతో కొందరు గాయపడ్డారు.
దాంతో ఆగ్రహించిన అభిమానులు ఎన్ కన్వెన్షన్ హాల్‌పై దాడికి దిగారు. అద్దాలు పగలగొట్టారు. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ వారు పోలీసులకు తెలిపారు. తక్షణం పోలీసులు అక్కడికి చేరుకుని అభిమానులను పంపేశారు. అయితే ఫ్యాన్స్ చేసిన పనికి బన్నీ తన ప్లాన్స్ మార్చుకున్నాడు. అభిమానులను సినిమా విడుదల తర్వాత కలవాలని ప్లాన్ చేసుకున్నాడట.
All About Yesterday 💥
Manalni Evadra Aapedhi ..?@Alluarjun • #Pushpa pic.twitter.com/RUp8UPjlqV— NikhiLᵐˢᵈⁱᵃⁿ🦁 (@BunnyNikhil214) December 13, 2021