సెకండ్ డోస్ తీసుకున్నా.. అల్లు అరవింద్‌ను వదలని కరోనా

by Jakkula Samataha |
సెకండ్ డోస్ తీసుకున్నా.. అల్లు అరవింద్‌ను వదలని కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ్డారు. గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న అల్లు అరవింద్.. తాజాగా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఆయన కరోనా బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అల్లు అరవింద్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి.

ఇటీవల తొలి డోస్ తీసుకున్న తర్వాత కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కరోనా సోకింది. కొద్దిరోజుల తర్వాత త్రివిక్రమ్ కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement
Next Story

Most Viewed