- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెలమ, కమ్మ సంఘాలకు రూ.100 కోట్ల భూమి కేటాయింపు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఆలిండియా వెలమ అసోసియేషన్, కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యలకు ఐదేసి ఎకరాల వంతున మొత్తం పది ఎకరాల భూమిని కేటాయించింది. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భూములవి. వీటి పక్కనే గతంలో వేలం వేయగా రూ.60 కోట్లు పలికిన స్థలాలు ఉన్నాయి. ఈ భూములు హైటెక్‌సిటీకి దగ్గరలోనే ఉండడం విశేషం.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్సర్వే నం.41/14లోని స్థలాన్ని కేటాయిస్తూ జూన్30న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ఏసీ రోడ్డులో ఐదెకరాలు, మరో ఐదెకరాలు హైటెక్‌సిటీ రోడ్డు పక్కన, అయ్యప్ప సొసైటీకి వెళ్లే దారిలో ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్పరిసర ప్రాంతాల్లో కమ్యూనిటీ భవనాలు నిర్మించుకోవడానికి ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని కోరారు. వారి సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం స్థలాన్ని అడిగారు. వెంటనే సదరు స్థలాన్ని ఆ సంఘాలకు అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.
హైటెక్ సిటీ వద్ద కమ్మ, వెలమ సంఘాలకు ఐదెకరాల భూమి లెక్కన కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. జూన్ 26న రంగారెడ్డి కలెక్టర్ ప్రతిపాదనలు పంపించగా జూన్ 29వ తేదీన సీసీఎల్ఏ నివేదిక పంపారు. మరుసటి రోజే భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.