- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వేషన్ల ప్రకారమే సీట్ల కేటాయింపు.. పుకార్లు నమ్మొద్దు
దిశ, తెలంగాణ బ్యూరో : జేఎన్టీయూలో పార్ట్టైం పీహెచ్‌డీ ప్రవేశాలపై పుకార్లు నమ్మొద్దని అడ్మిషన్స్డైరెక్టర్వెంకటరమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని, ఆయన స్పష్టం చేశారు. ఇందులో రిజర్వేషన్ల ఉల్లంఘనలు ఎక్కడా చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఓపెన్కేటగిరీలో నెట్, సెట్, గేట్, జీప్యాట్లేదా జేఎన్‌టీయూ ఎంట్రెన్స్‌లో క్వాలిఫై అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకే ఓపెన్కేటగిరీలోనే సీట్లు కేటాయించినట్లు చెప్పారు. అంతేకానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సీట్లకు ఓపెన్కేటగిరీకి చెందిన అభ్యర్థులకు కేటాయించలేదని పేర్కొన్నారు. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలకు చెందిన ఇద్దరు నిపుణులు ఈ జాబితాను వెరిఫై చేశారని, ఆ తర్వాతే రిజిస్ట్రార్, వర్సిటీ అధికారులు ఆమోదం తెలిపారన్నారు.