- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TUWJ చలో హైదరాబాద్ గోడపత్రిక ఆవిష్కరణ
దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్ట్ సంక్షేమానికి టీయుడబ్ల్యూజే హెచ్ 143 కట్టుబడి ఉందని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టీయూడబ్ల్యుజే హెచ్ 143 రాష్ట్ర మహాసభల సన్నాహాక సమావేశంలో అల్లం నారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదిన నిర్వహించ తలపెట్టిన చలో హైద్రాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ.. సభకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత ప్రతి జర్నలిస్టుకి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్‌కు అక్రిడేషన్ కార్డులను ఇప్పించడంలో సఫలీకృతం అయ్యామని వెల్లడించారు. ప్రతి జర్నలిస్ట్‌కు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.