- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఏప్రిల్ ఫూల్స్’.. చేసిన ప్రముఖ కంపెనీలు.. క్రేజీ అనౌన్స్‌మెంట్స్
దిశ, ఫీచర్స్: ‘ఏప్రిల్ 1’ అనగానే స్నేహితులు, బంధువులను, ఇంట్లో సభ్యులను ఫూల్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఆటపట్టించేందుకు చేసే ఈ పనులు చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఈ ‘ఫూల్స్ డే’ను చాలా సంస్థలు కూడా తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. అందుకు ‘ఏప్రిల్ 1’న వచ్చే ఏదైనా సమాచారం, అనౌన్స్‌మెంట్ అది అబద్ధం కావచ్చు. టెక్ లాంచ్, టీజర్ లేదా ప్రకటనలు ఖచ్చితంగా నిజమైనవి కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఈ ఏడాది ఏప్రిల్ ఫూల్స్ డే రోజున చేసిన ప్రాంక్స్ చూద్దాం.
పబ్‌జీ న్యూ గేమ్..
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అందుకున్న గేమ్ ‘పబ్ జీ’, అయితే ఈ ఫ్రాంచైజ్ నుంచి పొబ్‌జీ (POBG), ప్లేయర్ ఓమ్నమ్ (PlayerOMNOM) అనే రెండు కొత్త డైమెన్షనల్ గేమ్స్‌ను విడుదల చేస్తున్నట్లు పబ్‌జీ నిర్వాహకులు ‘ఏప్రిల్ 1’ ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ ఇది ఫూల్స్ డే స్పెషల్ అని వేరే చెప్పాలా?
రియల్ ‘మ్యావ్’..
గేమర్స్ లేదా టెక్ ఔత్సాహికులకు కాకుండా పిల్లల కోసం ‘రియల్ మ్యావ్’ పేరుతో ఓ కొత్త ప్రొడక్ట్‌ను తీసుకువస్తున్నామని ‘రియల్ మీ’ ప్రకటన విడుదల చేసింది. ‘మీరు రెడీగా ఉన్నారా? కానీ మేము లేము.. జస్ట్ స్టే ట్యూన్డ్ ..హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే! బట్ ఇట్ కుడ్ బీ నాట్ జస్ట్ ఏ జోక్’ అంటూ తమ వీడియోలో పేర్కొంది.
ఓలా ఎయిర్ ప్రో..
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వీటిదే హవా అని మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట. ఏదేమైనా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓలా ఎయిర్‌ప్రో అనే ఎయిర్ ప్రో క్యాబ్ సేవను ప్రారంభించనుంది. దీంతో ఓలా ఆకాశంలోకి ఓ అడుగు ముందుకు వేసింది, ఇది ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కారు కాగా అర్బన్ కమ్యూటర్‌కు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దుతోంది. ‘ప్రపంచంలో మొట్టమొదటి పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగిన, ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారుకు హలో చెప్పండి. ఇది మా ప్రో వెర్షన్.. అందుకే దీన్ని ఓలా ఎయిర్‌ప్రో అని పిలుస్తున్నాం’ అని ఓలా ట్వీట్ చేసింది. ఇది కూడా ఏప్రిల్ ఫూల్ చేసేందుకు చేసిన ట్వీటే.
బోట్ వినూత్నం..
ఆడియో బ్రాండ్ బోట్..నూతన ఇయర్‌ఫోన్‌లు లేదా స్పీకర్లను ప్రారంభించలేదు కానీ వినూత్నంగా తమ యాడ్ డిజైన్ చేసింది. ఇందుకోసం ప్రపంచంలోని ఐకానిక్ స్టాట్యూ (లిబర్టీ ఆఫ్ స్టాట్యూ, పిరమిడ్స్, మైఖేలాంజిలో) మెడలో బోట్ హెడ్ ఫోన్స్ చేర్చింది. దానికి ‘హేటర్స్ విల్ సే ఇట్స్ ఫొటో షాప్డ్’ అని అంటారంటూ రాసుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ పేమెంట్ ఆప్షన్‌గా బిట్ కాయిన్ తీసుకుంటున్నామని, రోగ్ సైబర్ షూస్ తీసుకొస్తున్నామని తెలపగా, ఈ ఫూల్స్ డే సందర్భంగా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఏసర్, టెక్ యాక్ససరీ బ్రాండ్ పోకో, ఆసుస్, అమేజ్ ఫిట్, వన్ ప్లస్ కంపెనీలు కూడా ఫూల్స్ డే స్పెషల్ ప్రాంక్స్ విడుదల చేశాయి.