- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీసీలను ప్రత్యేకంగా లెక్కించండి : శ్రీనివాస్ గౌడ్
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఈ సంవత్సరం నిర్వహించాల్సిన జనగణనలో బీసీల జనగణన కూడా నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. సామాజికవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీలను లెక్కించి బీసీలను లెక్కించకపోవడం మూలంగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని వెల్లడించారు. దీనివల్ల రిజర్వేషన్లు తగ్గిస్తున్నారని పేర్కొన్నారు. 2011లో కులాలవారీగా లెక్కలు తీసినా నేటికీ వాటిని అధికారికంగా వెల్లడించలేదన్నారు. బీసీల జనగణనకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని వారు కోరారు.
Next Story