‘గంగుబాయి కతియావాడి’ కేసు: అలియా, భన్సాలీకి రిలీఫ్

by Shyam |
Alia Bhatt, Sanjay Leela Bhansali
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ – సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌లో వస్తున్న ‘గంగుబాయి కతియావాడి’ చిత్రం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గంగుబాయి దత్తపుత్రుడు బాబూజీ షా.. నటి, దర్శకుడితో పాటు భన్సాలీ ప్రొడక్షన్స్‌పై పరువునష్టం దావా కేసు వేయగా.. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. కాగా ఈ కేసులో బాంబే హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. సెప్టెంబర్ 7న తదుపరి విచారణ జరగనుండగా.. అప్పటి వరకు స్టే విధించింది. కాగా, ‘ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కుతుండగా.. ఇప్పటికే రిలీజైనా ట్రైలర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది.

Advertisement

Next Story