- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మకు ప్రేమతో.. పెద్ద మనసు చాటుకున్న అలీ
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ కమెడీయన్ అలీ అవసరం వచ్చినప్పుడల్లా తన సేవా దృక్పథాన్ని చాటుకుంటాడు. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సినీ కార్మికులను ఆదుకోవడానికి కూడా తన వంతు సాయం చేశాడు. అయితే తాజాగా అలీ తల్లి జైతూన్ బీబీ చనిపోయి నేటికి ఏడాది అయ్యింది. దీంతో తన తల్లి గుర్తుగా సంవత్సరికం సందర్భంగా ఏదైనా చేయాలనుకున్నాడు. దీనిపై తాజాగా అలీ మాట్లాడుతూ..
‘‘పేదవారికి, అనాథాశ్రమాలకు వెళ్లి భోజనం పెడితే ఒక్క పూటతో పోతుంది. అలా కాకుండా ఏం చేయాలి? అనుకున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. మా అమ్మ ఎప్పుడూ శాలువానో, దుప్పటో కప్పుకుని ఉండేది. అసలే ఇప్పుడు చలికాలం. అందుకే ఆమె జ్ఞాపకార్థంగా హైదరాబాద్‌లోని క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, బస్టాండ్‌ల వద్ద ఉండేవారికి దుప్పట్లు పంచాలనుకున్నాను. మా అమ్మ వెచ్చని జ్ఞాపకాలతో చేస్తున్న ఈ సాయం ఎందరినో చలి నుంచి కాపాడుతుంది. ఇది పబ్లిసిటీ కోసం చెప్పటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు నా వంతుగా ఏదొకటి చేయడం నాకు ఆత్మసంతృప్తినిస్తుంది’’ అని అలీ అన్నారు. తన తండ్రి మహమ్మద్ బాషా పేరు మీద ఏర్పాటు చేసిన ‘మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా శనివారం అలీ ఈ సాయం అందించారు.