పవర్ ప్యాక్డ్ 'సూర్యవంశీ' ట్రైలర్

by Shyam |
పవర్ ప్యాక్డ్ సూర్యవంశీ ట్రైలర్
X

బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ ట్రైలర్ వచ్చేసింది. ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్‌తో దుమ్ములేపింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న ‘సూర్యవంశీ’ సినిమాలో అజయ్ దేవగన్, రణ్ వీర్ సింగ్ అతిథిపాత్రల్లో కనిపించనున్నారు. ముంబైలో 1993 నుంచి 2008 వరకు నాలుగు బాంబ్ బ్లాస్టులు జరిగాయ్. అయితే ఇప్పుడు భారత ఆర్థిక రాజధాని ముంబైని నామరూపం లేకుండా చేసేందుకు లష్కర్ ఉగ్రవాద సంస్థ బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తుంది. దీని గురించి తెలుసుకున్న యాంటీ టెర్రరిజమ్ స్వ్కాడ్ ఆఫీసర్ ‘సూర్యవంశీ’ ఏం చేశారు? ఈ క్రమంలో కన్న కొడుకును కోల్పోయిన ఆఫీసర్ భార్యకు దూరమవుతాడా? బాంబ్ బ్లాస్ట్‌ను ఆపేందుకు ‘సింఘం’ అజయ్ దేవగన్, ‘సాంబ’ రణ్ వీర్ సింగ్ ఎలా హెల్ప్ చేశారు? అనేదే కథ.

ముంబై పోలీసులు పాస్ పోర్టు మీద మతం చూసి గోలీ వాడరు … క్రిమినల్ రికార్డ్ చూసి కాల్చేస్తారు లాంటి డైలాగ్స్ ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. మార్చి 24న రిలీజ్ కానున్న సినిమాను ధర్మ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రోహిత్ శెట్టి పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీ సూర్యవంశీలో అక్షయ్ కుమార్ యాక్షన్ మోడ్‌ ఆకట్టుకుంటుండగా… సినిమా బాక్సాఫీసు వద్ద సునామి సృష్టిస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

Tags : Suryavanshi, Akshay Kumar, Bollywood, Ajay Devgan, Ranveer Singh, Rohit Shetty

Advertisement

Next Story