- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అఖిల’ టైటిల్ ఆవిష్కరణ
దిశ, వెబ్ డెస్క్: అక్ష ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖిల’. జయసింహ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మోహన్ రావు దర్శకత్వం వహించారు. జై చిరంజీవ ఫిలిమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న మూవీ టైటిల్ ఆవిష్కణ కార్యక్రమం హైదరాబాద్ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి నిర్మాత ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాత శెట్టి చిరంజీవికి ఈ సినిమా మంచి కలెక్షన్లు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చిన్న సినిమానే అయినా సరే అధిక థియేటర్లలో విడుదల చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.
సిటీలో జరుగుతున్న వరుస హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ ఆద్యంతం ఆసక్తిరకంగా సాగనుండగా..జయ సింహ, అక్ష క్యారెక్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు డైరెక్టర్. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుందని, నిర్మాత ఎక్కడా రాజీపడకుండా సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలిపారు. కెరీర్‌లో మరో మంచి పాత్ర లభించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది అక్ష. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ద్వారా మంచి పేరు లభిస్తుందన్న ఆమె..తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెప్పింది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు హీరో జయసింహ. అఖిల స్టోరీ వినగానే నచ్చిందని వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు.