భారత్‌ను కుప్పకూల్చిన ఒకే ఒక్కడు.. విశ్వవ్యాప్తమైన అజాజ్ పటేల్

by Anukaran |
భారత్‌ను కుప్పకూల్చిన ఒకే ఒక్కడు.. విశ్వవ్యాప్తమైన అజాజ్ పటేల్
X

దిశ, వెబ్‌డెస్క్: భార‌త్-న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్ల మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్సింగ్స్‌లో న్యూజిలాండ్ బౌల‌ర్ అజాజ్ ప‌టేల్ చెల‌రేగాడు. టీమిండియాలోని అన్ని వికెట్లు ఆయ‌న‌కే ద‌క్కాయి. టెస్టు క్రికెట్ చ‌రిత్రలో ఒకే ఇన్నింగ్సులో 10 వికెట్లు తీసిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు. న్యూజిలాండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ పుట్టింది ముంబయిలోనే. అజాజ్ పటేల్ 1988 అక్టోబరు 21న జన్మించాడు. అయితే కుటుంబ రీత్యా న్యూజిలాండ్‌కు వలసవెళ్లాడు. పటేల్ అక్కడే క్రికెట్‌లో ఉన్నతస్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఏకంగా అద్భుతమైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అది కూడా తాను పుట్టినగడ్డపైనే చిరస్మరణీయమైన రీతిలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టెస్టుల్లో ఈ ఘనతను ఇంతకుముందు జిమ్ లేకర్(ఇంగ్లాండ్), అనిల్ కుంబ్లే(భారత్) సాధించారు. వారి తర్వాత ఓ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు సొంతం చేసుకుని అజాజ్ పటేల్ చరిత్ర పుటల్లో తన పేరు లిఖించుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed