- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తమిళ్ అంధాదున్‌లో ఐష్?

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాదున్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆయుష్మాన్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం తెలుగు వర్షన్‌లో నితిన్ హీరోగా నటిస్తుండగా.. మేర్లపాక గాంధీ డైరెక్టర్. నభా నటేష్ హీరోయిన్ కాగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్నట్లు కన్‌ఫర్మ్ అయింది.
అయితే, ఇదే సినిమాను తమిళ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రశాంత్ హీరోగా ఆయన తండ్రి నిర్మించనున్న ఈ సినిమాలో టబు పాత్రలో నటించాలని ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను సంప్రదించినట్టు సమాచారం. దీని గురించి ఐష్ త్వరలో ఎస్ లేదా నో చెప్పే అవకాశం ఉండగా.. ఒకవేళ ఓకే చెప్తే మాత్రం జీన్స్ సూపర్ హిట్ జోడీ ఇన్నాళ్ల తర్వాత స్క్రీన్‌పై కనిపించి ఎంటర్‌టైన్ చేయనుంది. లేదంటే మరో పవర్‌ఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్‌ను వెతుక్కోక తప్పదు.