- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిమాయత్ నగర్‌లో బడ్జెట్ ప్రతుల దహనం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలకే రెడ్ కార్పెట్ పరుస్తోందని ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ చౌరస్తాలో శుక్రవారం బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోలి హరికృష్ణ, నరేష్ మాట్లాడుతూ.. 1964లో కేంద్రం నియమించిన కొఠారీ కమిషన్ విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని నివేదిక ఇచ్చిందని, కానీ రాష్ట్ర సర్కారు 5 శాతం మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, హైదరాబాద్ జిల్లాలో విద్యార్థులకు సరిపడా హాస్టల్ భవనాలు నిర్మించి వారికి నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.