- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రతి పక్షిని గుర్తుపట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
మనుషులందరూ ఒకేలా ఉండరు, ఒకేలా ఉన్నా పేర్లు భిన్నంగా ఉంటాయి. ప్రతి ఇద్దరు మనుషులకు కనీసం పది తేడాలుంటాయి. కానీ పక్షుల విషయంలో అలా కాదు. ఒక పక్షుల గుంపులో ఒక్కొక్క పక్షిని విడివిడిగా గుర్తుపట్టడం గొప్ప గొప్ప ఆర్నిథాలజిస్ట్‌ల వల్ల కూడా కాదు. కానీ పనిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చేస్తోంది. కేవలం ఫొటోను చూడటం ద్వారా దాదాపు 200లకు పైగా వివిధ పక్షులను గుర్తించగలుగుతోంది. డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. 200 జాతులకు చెందిన 11,000ల పక్షుల ఫొటోలను చూపించి టూల్‌ను ట్రెయిన్ చేశారు. హమ్మింగ్ బర్డ్స్ నుంచి బాతుల వరకు అన్ని రకాల పక్షులను ఒక ప్యాటర్న్ ప్రకారం ఈ టూల్ గుర్తుపెట్టుకుంటుందని, హీట్ మ్యాప్ ద్వారా ఇది పక్షులను గుర్తుపట్టగలుగుతోందని పరిశోధకుడు రాబిన్ స్మిత్ అంటున్నారు.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ దాదాపుగా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ మాదిరిగానే పనిచేస్తుందని, అయితే దానికి దీనికి సంబంధం లేదని స్మిత్ వివరించారు. ఇప్పుడు వారు తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ టెస్ట్ చేసిన ప్రతీసారి 84 శాతం కచ్చితమైన ఫలితాలను ఇచ్చిందని స్మిత్ తెలిపారు. అయితే అంతరించిపోతున్న పక్షుల జాతులను కాకుండా ఈ టెక్నాలజీ సాయంతో అంతరించిన పక్షి ఏదని, దాని అడుగుజాడలను కూడా కనిపెట్టవచ్చని చెప్పారు. ఈ టూల్ ద్వారా దాదాపు ప్రతి పక్షికి పేరు పెట్టినట్లుగా పరిగణించవచ్చని, డీప్ లెర్నింగ్ విధానాల ద్వారా త్వరలోనే 100 శాతం ఫలితాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తామని స్మిత్ వెల్లడించారు.