వాటిని సాగు చేయండి.. వ్యవసాయ అధికారి మోహన్ సూచన

by Shyam |   ( Updated:2021-09-23 05:50:58.0  )
Agriculture Officer Mohan
X

దిశ, దుబ్బాక: యాసంగి సీజన్‌లో వరిపంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన నూనె గింజలను సాగు చేయాలని తొగుట మండల వ్యవసాయ అధికారి మోహన్ రైతులకు సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని పెద్దమాసాన్‌పల్లి, వెంకట్రావుపేట్, గోవర్ధనగిరి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులకు యాసంగిలో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలైన నూనె గింజలు(వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు) శనగలు, కూరగాయలు, మల్బరీ, ఆయిల్‌ఫామ్, వంటి విత్తనోత్పత్తి పంటలను సాగు చేయాలని సూచించారు. వాటి వలన అనేక ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దమాసాన్‌పల్లి గ్రామ రైతుబంధు కో-ఆర్డినేటర్ యాదయ్య, ఎంపీటీసీ సుమలత కనకయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీనివాస్, సర్పంచులు లీలాదేవి, ఎల్లయ్య, స్వామి, ఎంపీటీసీ నర్సింలు, నవీన్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed