- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీసీ లేకున్నా అడ్మిషన్లు.. ఏ క్లాస్ వరకంటే..?
దిశ, తెలంగాణ బ్యూరో: టీసీలు లేకున్నా 8వ తరగతి వరకు విద్యార్థులు ఇతర పాఠశాలలో చేరవచ్చని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల భారం మోయలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో టీసీలు ఇచ్చేందుకు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. టీసీలు లేకుండా జాయిన్ చేసుకునే అంశంపై తమకు స్పష్టమైన ఆదేశాలు లేవని ప్రభుత్వం హెడ్ మాస్టర్లు విద్యార్థులను చేర్చుకోవడం లేదు. చైల్డ్ ఇన్ ఫో పోర్టల్ లో సమస్యలు తలెత్తుతున్నాయని వివరిస్తున్నారు.
టీసీ లేకున్నా 8వ తరగతి వరకు అడ్మిషన్లు
ఆన్ లైన్ పాఠాల పేరుతో ఇష్టారీతిలో ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇతర పాఠశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినా టీసీలు మంజూరు చేయకుండా వేధిస్తున్నారు. అడిగినంతా ఫీజులు చెల్లించకుంటే విద్యార్థులను ఆన్ లైన్ తరగతులకు అనుమతించమని స్పష్టం చేస్తున్నారు. పాఠశాల వదిలి వెళ్లేందుకు టీసీలు ఇవ్వకుండా, తరగతులకు హాజరుకానివ్వకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను మానసిక వేధనకు గురిచేస్తున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం విద్యార్థులను, తల్లిదండ్రులను కాపాడేందుకు టీసీలు లేకున్నా ఇతర పాఠశాలలో చేరవచ్చని ప్రకటించింది. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు ఎలాంటి టీసీ లేకుండా ఇతర పాఠశాలలో చేరవచ్చని ఆదేశాలు జారీ చేశారు. నేరుగా నచ్చిన పాఠశాలకు వెళ్లి జాయిన్ కావచ్చని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు
కరోనా ప్రభావంతో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్యతరగతి ప్రజలు పిల్లల చదువుల విషయంలో నిర్ణయాలు మార్చుకుంటున్నారు. కేవలం ఆన్ లైన్ తరగతులను మాత్రమే నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తుండటంతో తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు అడిగినంత ఫీజులు చెల్లించుకోలేని పేరెంట్స్ ప్రభుత్వ పాఠశాలల వైపు చూస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన వెసలుబాటుతో 8వ తరగతి వరకు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు.
టీసీలు లేకుండా జాయిన్ చేసుకోని హెడ్ మాస్టర్లు
టీసీలు లేకుండా విద్యార్థులను జాయిన్ చేసుకునేందుకు ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్లు నిరాకరిస్తున్నారు. డీఈఓలను నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు లేవని అడ్మిషన్ చేసుకోవడం లేదు. 8వ తరగతి వరకు టీసీలు లేకుండా నచ్చిన పాఠశాలలో జాయిన్ కావొచ్చని తెలిపినా ప్రభుత్వం ఇందుకు సంబంధించి విధివిధాలను ప్రకటించడం లేదు. టీసీ లేకుండా విద్యార్థులు ఇతర పాఠశాలలో చేరడం వలన సాంకేతిక సమస్యలు వెలువడుతున్నాయి. ఒక పాఠశాల నుంచి వెళ్లిపోయిన విద్యార్థికి సంబంధించి వివరాలను ఆ పాఠశాల యాజమాన్యాలు అధికారిక చైల్డ్ ఇన్ ఫో వెబ్ పోర్టల్ లో రిమూవుడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం టీసీ, బోనఫైడ్ ఇతర వివరాలతో కొత్తగా చేరే పాఠశాల అధ్యాపకులు చైల్డ్ ఇన్ ఫో వెబ్ పోర్టల్ లో జాయిన్ చేయాల్సి ఉంటుంది.
పాత పాఠశాల యాజమాన్యాలు విద్యార్థి వివరాలను రిమూవుడ్ చేస్తేనే కొత్త పాఠశాల అధ్యాపకులు జాయిన్ చేసే వెసులుబాటు ఉంటుంది. టీసీ, బోనఫైడ్‌లు లేకుండా చైల్డ్ ఇన్ ఫో వెబ్ సైట్‌లో విద్యార్థులను చేర్చుకోవడం సాధ్యం కాదు. ఈ కారణాలతో ప్రభుత్వం పాఠశాలలో టీసీ లేకుండా విద్యార్థులను చేర్చుకునేందుకు అధ్యాపకులు నిరాకరిస్తున్నారు. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టలేదు. దీంతో ప్రభుత్వం వెసులుబాటు కల్పించినప్పటికీ విద్యార్థులు ఇతర పాఠశాలకు వెళ్లలేకపోతున్నారు.