- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాస్ సీరియస్.. ఆదిలాబాద్ పోలీసులు హ్యాపీ
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కరోనా వణికిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా ఎప్పుడు, ఎక్కడ పని చేస్తారో తెలియని పోలీసులు కొవిడ్ బారిన పడుతుండడం ఉన్నతస్థాయి అధికారులను కలవరపెడుతోంది. గడిచిన రెండు నెలల వ్యవధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంద మందికి పైగా కరోనా సోకడంతో విధులకు దూరమయ్యారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులంతా ఇళ్లకు పరిమితమయ్యే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి రక్షణ కల్పించే వ్యూహాన్ని అమలు చేసి, అండగా నిలవాలని ఆ శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు.
వంద మందికి పైగా బాధితులు
ఉమ్మడి జిల్లాలో సుమారు 100 మంది దాకా పోలీసులు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. వారితోపాటు నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అనేక మంది పోలీసులు లక్షణాలతో బాధపడుతున్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లాలోనూ పోలీసులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు బాధపడుతున్నారని, అందులో ఇప్పటికే కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఒక నిర్మల్ జిల్లాలోనే సుమారు 30 మందికి పైగా కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో 30 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 20 మంది డ్యూటీలో ఉండగానే కరోనాకు గురైనట్లు పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
మరణాలతో కలవరం
కరోనా లక్షణాలతో పోలీసు సిబ్బంది చనిపోవడం ఆ శాఖ ఉన్నతాధికారులను ఆందోళనకు గురి చేసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన ఎస్సై శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. వ్యాధి నిర్ధారణ చేయనప్పటికీ, లక్షణాలు మాత్రం కరోనా మాదిరిగానే ఉన్నాయని చెబుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అందరితో కలుపుగోలుగా ఉంటూ శాంతిభద్రతలు అమలులో ముందుండే ఆయన మరణాన్ని ఖానాపూర్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కానిస్టేబుల్ కరోనా బారినపడి మృత్యువాతపడ్డాడు. ఇలాంటి సంఘటనలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. శాంతి భద్రతల విషయంలో నిరంతర సేవలు అందించే పోలీసులు కరోనాకు గురవుతుండడం బాధాకరం.
అందరికీ టెస్టులు.. ఎస్పీ ముందస్తు జాగ్రత్త
ఉమ్మడి జిల్లా పోలీసులను కరోనా వణికిస్తుండడంతో పోలీస్‌బాస్ విష్ణు ఎస్ వారియర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ తో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా బాధ్యతలను చూస్తున్న ఆయన మూడు జిల్లాల్లోనూ ప్రతి పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు, ఎస్ఐలు, ఆ పై స్థాయి అధికారులు, కార్యాలయాల సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల వైద్యాధికారులు, కలెక్టర్లతో మాట్లాడి ప్రతి ఒక్కరికీ టెస్టు చేయిస్తున్నారు. ఈ నిర్ణయం జిల్లా పోలీస్ వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నది. తమ ఆరోగ్య పరిరక్షణకు జిల్లా ఎస్పీ తీసుకుంటున్న చర్యలపై జిల్లా పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.