- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దామోదర్‌రెడ్డిపై అద్దంకి ఫిర్యాదు.. చేస్తాడంట!
దిశ, వెబ్ డెస్క్: గతకొద్ది రోజుల నుంచి అంతర్గతంగా నడుస్తున్న తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కనున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తుంగతుర్తి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎస్సీ సెల్ నేతలు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. తనను నియోజకవర్గంలో తిరగొద్దంటూ బెదరించాడని మాజీ మంత్రి దామోదర్ రెడ్డిపై వీరు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది.
అయితే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఇప్పటినుంచే తుంగతుర్తి నియోజకవర్గంలో పావులు కదుపుతున్నట్లు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇందుకోసం ఆయనకు రాష్ట్రంలోని ప్రముఖ కాంగ్రెస్ నేతలు కూడా సహకరిస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. కాగా, చాపకింద నీరులా సాగుతున్న కాంగ్రెస్ వర్గపోరు ఎక్కడి వరకు చేరుతదో అనేది వేచి చూడాల్సిందే.