- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాస్టర్ చెఫ్ షో డీటెయిల్స్ చెప్పేసిన మిల్కీ బ్యూటీ
దిశ, శేరిలింగంపల్లి: తెలుగింటి వంటకాలకు (రుచులకు) గ్లోబల్ గుర్తింపు తేవడమే లక్ష్యంగా ఎండేమోల్ భాగస్వామ్యంతో అత్యంత జనాదరణ పొందిన మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ప్రకటించారు ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రావణ ప్రసాద్. శుక్రవారం మాదాపూర్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మాస్టర్ చెఫ్ తెలుగు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మాస్టర్ చెఫ్ తెలుగు హోస్ట్ నటి తమన్నా భాటియా.. మాస్టర్ చెఫ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న చెఫ్‌లు చలపతిరావు, సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, టైటిల్ స్పాన్సర్ బట్టర్ ఫ్లై, శక్తి మసాలా, హీరో లైఫ్, సుధా హాస్పటల్, ఇన్వెనియో ఒరిజినల్‌తో కలిసి మాస్టర్ చెఫ్ షోకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా నటి తమన్నా భాటియా మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన మాస్టర్ చెఫ్ ఇప్పుడు తెలుగింటి ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఫుడ్ అంటే కేవలం ఆడవాళ్లు చేసేదని, ఆడవాళ్లకు మాత్రమే పరిమితం అనుకునే ప్రతీ ఒక్కరి అభిప్రాయం మారుతుందన్నారు. ఫుడ్ అనేది అందరికీ అవసరమని, ఎవరైనా వంట చేయొచ్చు అని చూపే మంచి కార్యక్రమమని అన్నారు. ఫుడ్ అంటేనే కల్చర్ అని, వంట చేయడం అంటే ఓ పండగ అని అన్నారు. ఫుడ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తెలుగు రుచులంటే నోరూరుతుందన్నారు తమన్నా.
మాస్టర్ చెఫ్ ద్వారా విభిన్న రుచులను ఆస్వాదించానన్నారు. ప్రతీ శని, ఆది వారాల్లో జెమినీ టీవీలో వచ్చే ఈ కార్యక్రమాన్ని ఆదరించాలని మిల్కీ బ్యూటీ కోరారు. ఆ తర్వాత అల్లు శిరీష్ మాట్లాడుతూ.. తనకు వంట గూర్చి ఏమాత్రం తెలియదని, కానీ తినడం మాత్రం ఇష్టమన్నారు. మాస్టర్ చెఫ్‌కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న చలపతిరావు, సంజయ్ తుమ్మ, మహేష్ పడాల మాట్లాడుతూ తెలుగు వంటకాలకు అమోఘమైన గుర్తింపు లభిస్తుందన్నారు. ఎన్నో కొత్త వంటకాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నోవేటివ్ ఫిలిమ్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రావణ ప్రసాద్‌తో పాటు బటర్ ఫ్లై, ఇతర టైటిల్ స్పాన్సర్ ప్రతినిధులు పాల్గొన్నారు.