టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయా.. భూమికా చావ్లా

by Shyam |   ( Updated:2021-11-16 11:42:06.0  )
boomika
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమికా చావ్లా.. సినిమా అవకాశాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తన వ్యక్తిత్వం మంచిది కాదని, అందువల్లే తనకు సినిమా అవకాశాలు రావట్లేదనే నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు నిర్మాతలు, దర్శకులు, హీరోలు, సెలబ్రిటీలను కలవడానికి ఇష్టపడదని.. ప్రైవేటు పార్టీలకు కూడా వెళ్లదని వస్తున్నా వార్తలపై భూమిక స్పందించింది. ‘పార్టీలకు వెళ్తే తప్పా మంచి రోల్స్‌ రావా? అలాంటి మాటలను నేను ఎంకరేజ్‌ చేయను.

ఫిల్మ్‌ మేకర్స్‌తో రోజూ టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నది భ్రమ మాత్రమే. నా కోసమే పాత్రలు రాసి, నా కోసం ముంబై వచ్చిన మేకర్స్‌ చాలా మంది ఉన్నారు. కానీ అందరిని కలిసి, వాళ్లతో తిరిగితేనే అవకాశాలు వస్తాయనటం ఓ మూర్ఖత్వం’ అని చెప్పుకొచ్చింది. ఇక 2007లో నిర్మాత భరత్ ఠాకూర్‌తో మ్యారేజ్ అయిన తర్వాత హీరోయిన్‌ రోల్స్‌కి గుడ్‌బై చెప్పిన భూమిక.. ప్రస్తుతం అక్క, వదిన, అమ్మ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Advertisement

Next Story