కొండగట్టు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు

by Shyam |
కొండగట్టు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న శ్రీరామనవమి, హనుమాన్ జయంతి నేపథ్యంలో కొండగట్టు అంజన్న ఆలయంలో ఈ నెల 29 వరకూ ఆర్జిత సేవలను రద్దు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. కరోనా ప్రభావం నేపథ్యంలో ప్రస్తుతానికి అర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఆలయ అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఆలయంలో హనుమాన్ మాల విరమణ చేసేందుకు అనుమతి లేదని వెల్లడించారు. చిన్న హనుమాన్ జయంతిని కూడా అంతరంగికంగానే చేయాలని దేవాలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు

Advertisement

Next Story

Most Viewed