ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్: ఏసీపీ శివ రామయ్య

by Shyam |
ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్: ఏసీపీ శివ రామయ్య
X

దిశ, శాయంపేట: ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహించామని ఏసీపీ శివరామయ్య అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో కార్డెన్ సెర్చ్ లో భాగంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇరవై రెండు ద్విచక్ర వాహనాలు ఒక ఆటోను సీజ్ చేసి సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమాన విధించారు. ఇద్దరు బెల్టుషాపు నిర్వాహకులతో పాటు ఒక గుడుంబా వ్యాపారి వద్ద అక్రమ మద్యం స్వాధీనం చేసుకొన్నామని ఈ మేరకు వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు ఏసీపీ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గ్రామంలోని యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలు వాడినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్డెన్ సెర్చ్ లో శాయంపేట, ఆత్మకూర్, దామెర, పరకాల సీఐలు రమేష్ కుమార్, రంజిత్ కుమార్, మహేందర్ రెడ్డి, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, ఏఎస్ఐ లు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed